రాజకీయ విమర్శల్లో కుటుంబ సభ్యులను తీసుకురావడంపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. మాపై రాజకీయాలు చేయండి ఎదుర్కొంటాం.. అంతే కానీ.. వైఎస్ కుటుంబీకులను లాగితే ఊరుకోమని హెచ్చరిస్తున్నా అంటూ తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాం తో ఏపి ప్రభుత్వానికి సంబంధం లేదంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. వైఎస్ భారతమ్మ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి బంధువులు లిక్కర్ స్కాం సూత్రధారులని.. ఉద్దేశ్యపూర్వకంగా దీనిని వైఎస్ జగన్ కుటుంబీకులకు అంటగడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మండిపడ్డారు.


సిగ్గుమలిన వ్యక్తులే ఇలా కుటుంబీకుల పై ఆరోపణలు చేస్తారంటున్నమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి... తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. ఆరు వేల కోట్ల విద్యుత్ బకాయిలపై పోరాడుతున్నామన్నారు. బకాయిలు ఎగ్గొట్టడానికే రూ. 1700 కోట్లు ఇవ్వాలంటూ తెలంగాణ కోర్టును ఆశ్రయించిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. ఈ నెల 22న సీఎం జగన్ కుప్పం లో పర్యటించనున్నారని తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. మూడో విడత చేయూత పథకంను సీఎం ఇక్కడ లబ్ధిదారులకు విడుదల చేస్తారని వివరించారు.


ఇసుకపైనా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. ఇసుక కేటాయింపు పారదర్శకంగా జరుగుతోందన్నారు. ఇసుక కాంట్రాక్ట్ దక్కించుకున్న వారు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వచ్చు దీంతో ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. ఇసుక విషయంలో అక్రమాలు అరికట్టేందుకు విజిలెన్స్ విభాగం పటిష్టంగా పనిచేస్తోందని.. ప్రభుత్వ షాదీ తోఫా ప్రకటనను పక్కదారి పట్టించేందుకే ఇలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విమర్శించారు.  100 శాతం ఎన్నికల హామీలు అమలుచేస్తున్నది సీఎం జగన్ సర్కారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గుర్తు చేశారు.


అయితే.. ఇలాంటి రాజకీయ ఆరోపణల విషయంలో కుటుంబ సభ్యులను తీసుకురావడం ఏమాత్రం మంచిది కదా.. గతంలో చంద్రబాబు భార్య విషయంలోనూ వైసీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడారు. ఫ్యామిలీ ఎవరికైనా ఫ్యామిలీయే అని నేతలంతా పార్టీలకు అతీతంగా గుర్తిస్తే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: