
అయినా వీళ్ళందరికీ తెలియకుండా భారత్ తను అణు పరీక్షల కోసం కావలసిన సామాగ్రిని.. రహస్యంగా ఎడ్లబండ్లమీద సైకిళ్ల మీద విడివిడిగా సమకూర్చుకొని పీవీ నరసింహారావు గారి హయాంలో.. అణుపరీక్షకు సిద్ధమయ్యారు.కానీ ఆయనకున్న ప్రతిబంధకాల వల్ల ముందడుగు వేయలేకపోయారు. పివి నరసింహారావు గారు ఆ డేటాను ఆ తర్వాత వచ్చిన అటల్ బిహారీ వాజపేయికి ఇచ్చి వెళ్లారు. వాజపేయి అంతా సిద్ధం చేసుకున్నాక ఆయన హయాంలో తిరిగి అణు పరీక్షలు జరిగాయి.
భారత్ రెండోసారి అణు పరీక్షలు చేస్తుందని అప్పుడు ప్రపంచమంతా బహిరంగంగా తెలిసింది. మొదటి అణుపరీక్ష ఇందిరా గాంధీ హయాంలో..ఆ తర్వాత అటల్ బిహారీ వాజపేయి టైంలో మూడు అణుపరీక్షలు , అలా మొత్తం నాలుగు అణు పరీక్షలు జరిగాయి. దాంతో మళ్లీ చాలా దేశాలు భారత దేశంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. కానీ అప్పుడు ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఇవన్నీ పట్టించుకోకుండా, ఈ దేశాలకు తలొగ్గకుండా మిగిలిన రెండు అణు పరీక్షలను కూడా జరిపారు. కానీ ఇవన్నీ జరిగేసరికి ప్రపంచ దేశాలు భారతదేశంపై ఆంక్షలు పెట్టేసాయి.
దీంతో భారత్ మేం తొలిగా అణ్వస్త్రాలను వాడబోమని ప్రకటించింది.. మమ్మల్ని అణ్వస్త్రాల దేశాలలో కలుపుకోమని చెప్పినా మిగిలిన దేశాలు ఇప్పటివరకు భారత్ ని కలపలేదు. తాజాగా యూరోప్ యూనియన్ పార్లమెంట్ కి ఇచ్చిన నివేదికలో భారత్ వద్ద ఉన్న అణ్వస్త్రాల సమాచారం తెలుసుకోవడం చాలా కష్టమని చెప్పడం ఒక సంచలనంగా మారింది.