
ముఖ్యంగా కోటంరెడ్డిని జగన్ ముందే పసిగట్టారు. కోటం రెడ్డి టిడిపిలోకి వెళ్లే అవకాశం ఉందని వారితో చర్చలు జరుపుతున్నట్లు, అనుకూలంగా ఉంటున్నట్లు ఆయన ముందే తెలుసుకున్నారు. కాబట్టి ఆరు నెలల ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డిని కోటంరెడ్డి స్థానంలో నియమించారు. కానీ కోటంరెడ్డి వాయిస్ కు భయపడి లేదా కోటంరెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆదాల నోరు మెదపలేదు. కానీ కోటంరెడ్డి బహిరంగంగా బయటకు వచ్చి జగన్ పై ప్రభుత్వం పై విమర్శలు చేశాడు. అవి మీడియా ఎదుట చెప్పడంతో ఆదాలకు లైన్ క్లియర్ అయింది.
ఈ విషయంలో నెల్లూరులో మరో సీనియర్ నాయకులు మేకపాటి కుటుంబానికి వైఎస్ జగన్ టికెట్ ఇచ్చే పరిస్థితిలో లేరని తెలుస్తుంది. మేకపాటి కూడా తెలుగు దేశంతో టచ్ లో ఉన్నట్టు జగన్ కు తెలిసింది. మేకపాటి స్థానంలో ప్రైవేటు విమానాయన సంస్థల పార్ట్స్ అమ్మే కంపెనీలు ఉన్నటువంటి మూల వెంకట రమణ రెడ్డి అనే వ్యక్తికి టికెట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.
దీనితో పాటు ఆనం స్థానంలో నేదురుమల్లి ని నియమించినట్టు తెలుస్తోంది. కాబట్టి నెల్లూరు రాజకీయల్ని జగన్ నిశితంగా పరిశీలిస్తున్నారని స్పష్టం అవుతోంది. ఇప్పటికే నెల్లూరు లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎవరితో టచ్ లో ఉన్నారో అన్ని ఆయన గమనించారని ఇట్టే అర్ధమవుతోంది.