కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమని మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇటీవల వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈమె టాప్ లీడర్ గా కొనసాగారు. ఈమెకు ఖమ్మంలో సీటు వచ్చే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆంధ్ర ఎంపీల చొక్కాలు పట్టుకుని లాగిన వ్యక్తుల్లో రేణుకా చౌదరి ఒకరు. తెలంగాణలో మాత్రం ప్రస్తుతం ఆమెకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. విజయవాడ నుంచి అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధమని అంటున్నారు. అక్కడ పోటీ చేయడానికి కాంగ్రెస్ నుంచి సరైన అభ్యర్థే లేరు. అలాంటపుడు ఆమెను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్దని అంటే ఆశ్చర్యపోవాల్సిందే.


ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక వర్గ ఓట్లు పెద్ద బలం. విజయవాడ అంటే టీడీపీకి కంచుకోట. వైసీపీ హవాలో కూడా విజయవాడ, గుంటూరు ఎంపీ స్థానాల్లో టీడీపీ గెలిచింది. కానీ రేణుకా చౌదరి పోటీలో నిలబడితే మాత్రం టీడీపీ అనుకూల ఓట్లు చీలతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగుదేశం నుంచి కేశినేని నాని పోటీ చేయనని అంటారు. కేశినేని చిన్నికి సీటు ఇచ్చినా అది వైసీపీకి లాభం చేకూరుతుంది.


రేణుకా చౌదరి ఒక వేళ పోటీ చేస్తే టీడీపీ ఎలా స్పందిస్తుంది. టీడీపీ విజయవాడలో  గెలిచే అవకాశం ఉంటుంది. పోటీలో అభ్యర్థిని ఎవరిని దించుతారనేది ఇక్కడ ప్రశ్న. ఏ మాత్రం ఓట్లు చీలిపోయినా వైసీపీ విజయవాడ ఎంపీ స్థానం కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. చంద్రబాబు విజయవాడ ఎంపీ స్థానంలో ఎవరిని నిల్చొబెడతారనేది ఇక్కడ గెలుపొటములపై ఆధారపడి ఉంటుంది.  రేణుకా చౌదరి కాంగ్రెస్ నుంచి  పోటీలో ఉన్నాఎక్కడా గెలిచే దాఖలాలు కనిపించడం లేదు. ఈమె మాత్రం పోటీలో ఉండి వైసీపీకి పరోక్షంగా సాయం చేసేలా కనిపిస్తుంది. తెలంగాణ లీడర్ ఆంధ్రలో పోటీ చేస్తే ప్రజలు ఆదరణ చూపిస్తారో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: