
మొత్తం 62 పోస్టులకు దరఖాస్తు లు కోరుతుంది..
జూనియర్ సివిల్ ఇంజనీర్లు: సివిల్ విభాగంలో 16 పోస్టులు ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు ఉండాలి
హిందీ ట్రాన్స్‌లేటర్: ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా హిందీలో పీజీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థి వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు: ఇవి 5 పోస్టులు ఉన్నాయి. కామర్స్ డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. సీఏ/ ఐసీడబ్ల్యుఏఐ/ కంపెనీ సెక్రటరీ కోర్సులు చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. నిర్ధేశిత అనుభవం తప్పనిసరి. 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
అప్పర్ డివిజన్ క్లర్కులు: ఇవి 12 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంఎస్ వర్డ్, ఎక్స్‌ఎల్, పవర్ పాయింట్, ఇంటర్‌నెట్ అంశాల్లో అవగాహన అవసరం. అభ్యర్థి
వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టెనోగ్రాఫర్లు: అయిదు పోస్టులు ఉన్నాయి. ఇంటర్/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతోపాటు నిమిషానికి 80 పదాల టైపింగ్ వేగం ఉండాలి. 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్నవారు అర్హులు.
లోయర్ డివిజన్ క్లర్కులు: ఇవి 23 పోస్టులు ఉన్నాయి. ఇంటర్/ పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లీష్ టైపింగ్ తెలిసి ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్, ఇంటర్నెట్ అంశాల్లో అవగాహన తప్పనిసరి..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిన చివరి తేదీ..జూన్ 25..
nwda.gov.in అధికారిక వెబ్ సైట్ లో చూసి పూర్తి వివరాలను ఒకసారి చదివి అప్లై చేసుకోవచ్చు...