ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల వసతి గృహాల్లో కచ్చితంగా ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.క్రమం తప్పకుండా వైద్యులు హాస్టళ్లకు వెళ్లాని, వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. గురుకుల పాఠశాలల్లో అకడమిక్‌ వ్యవహారాల పర్యవేక్షణను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. మండలాల్లో ఇద్దరు ఎంఈఓల నియామకం ద్వారా జరుగుతున్న పర్యవేక్షణ మాదిరిగా గురుకుల పాఠశాలల్లోనూ జరగాలన్నారు. మౌలిక సదుపాయాలు, భోజనం నాణ్యత, నిర్వహణ వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. ఇందు కోసం ఒక్కో అధికారికి ప్రత్యేక పరిధిని నిర్ణయించాలన్నారు. కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో 2 విడతలుగా నాడు -నేడు కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు.విద్యారంగంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకూ నాణ్యమైన విద్య అందుతోందని సీఎం జగన్ అన్నారు.


గతంలో కార్పొరేట్‌ స్కూళ్లకు మేలు కలిగించేలా విధానాలు ఉండేవని, కానీ వైసీపీ పాలనలో ఆ పరిస్థితులు చాలా వరకు మారిపోయాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలో వచ్చాక విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టామని గుర్తు చేశారు. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి సొంతూరు నారావారిపల్లెలోనూ స్కూళ్లనే పట్టించుకోలేదన్న సీఎం జగన్.. కుప్పంలో స్కూళ్లు దీనావస్థలో ఉండేవని విమర్శించారు. మనబడి, నాడు-నేడు ద్వారా 57 వేల స్కూళ్లు, హాస్టళ్లు అభివృద్ధికి 16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ ఉద్ఘాటించారు.హాస్టళ్లలో పారిశుద్ధ్యం, పరిశుభ్రతలపై దృష్టి పెట్టాలని విద్యాకానుకతో పాటు కాస్మొటిక్స్ కూడా అందించడానికి చర్యలు తీసుకోవాలని ఇంకా అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతగా ఉండాలని ఇంకా అలాగే టాయిలెట్ల నిర్వహణ అలాగే మౌలిక సదుపాయాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీలతో ప్రభుత్వ హాస్టళ్లను అనుసంధానం చేయాలని హాస్టళ్ల నిర్వహణలో ఖాళీలను గుర్తించి, భర్తీ చేయాలని ఇక ఈ నిర్ణయాలకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసి నివేదిక అందించాలని జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: