కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సడెన్‌గా గుండెపోటుతో మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని తెలుస్తుంది.కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా కూడా

తన నటన మరియు డ్యాన్స్ అలాగే ఫైట్స్‌తో ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నాడని తెలుస్తుంది.కన్నడ ఇండస్ట్రీలో పవర్ స్టార్ బిరుదును కూడా పునీత్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం కన్నడలో టాప్ లీగ్ స్టార్లలో పునీత్ రాజ్‌కుమార్ కూడా ఒకడని అందరికి తెలుసు.. ఇంత స్టార్‌డం సంపాదించుకున్న పునీత్ రాజ్‌కుమార్‌ను హీరోగా పరిచయం చేసింది ఎవరంటే మన తెలుగు దర్శకుడు అయిన పూరి జగన్నాథ్.

2002లో 'అప్పు' అనే సినిమాతో పునీత్ రాజ్‌కుమార్‌ను పూరి జగన్నాథ్ హీరోగా పరిచయం చేశాడని తెలుస్తుంది.అంతకుముందు బాలనటుడిగా పునీత్ ఎన్నో సినిమాలు చేసినా కూడా మొదటి సినిమాతోనే తనను పూరి స్టార్‌ను చేశాడని సమాచారం.ఈ సినిమానే తెలుగులో రవితేజతో 'ఇడియట్' పేరుతో రీమేక్ చేయగా  ఈ సినిమా మాస్ మహరాజ్ కెరీర్‌ను కూడా మలుపు తిప్పినట్లు తెలుస్తుంది.

అంతకుముందు 2001లో పునీత్ రాజ్‌కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్‌తో తమ్ముడు సినిమాని యువరాజాగా రీమేక్ చేసి పూరి హిట్ కొట్టాడని సమాచారం. దీంతో రాజ్‌కుమార్ పిలిచి మరీ పునీత్‌ను లాంచ్ చేసే అవకాశం పూరి చేతిలో పెట్టారని ఈ సినిమాల ఎన్నో భాషల్లో అధికారికంగా రీమేక్ అయినట్లు తెలుస్తుంది.

తెలుగులో రవితేజ హీరోగా ఇడియట్ పేరుతో, తమిళంలో శింబు హీరోగా దమ్ పేరుతో ఈ సినిమా రీమేక్ అయిందని బెంగాలీ మరియు బంగ్లాదేశీ భాషల్లోకి కూడా ఈ సినిమా రీమేక్ అయిందని ఈ రెండు భాషల్లోకి రీమేక్ అయిన రెండో కన్నడ సినిమా ఇదేనని తెలుస్తుంది.ఆ తర్వాత పునీత్ రాజ్‌కుమార్ కెరీర్ పరుగులు పెట్టినట్లు సమాచారం.

ఎన్నో తెలుగు సూపర్ హిట్ సినిమాలను పునీత్ కన్నడలో రీమేక్ చేశారని తెలుగు హీరోలతో కూడా తనకు సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది.చక్రవ్యూహ సినిమాలో గెలయా గెలయా పాటను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పాడాడని అందరికి తెలుసు.బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్ వంటి హీరోలతో పునీత్ ఎంతో సన్నిహితంగా ఉండేవాడట.. ఇప్పుడు తన మృతితో తెలుగు ఇండస్ట్రీ కూడా షాక్‌లోకి వెళ్లిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: