లోక నాయకుడిగా గుర్తింపు పొందిన కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ప్రపంచం మెచ్చిన గొప్ప నటుడిగా గుర్తింపు పొందాడు. ఇక అంతేకాదు ఈయన కూతురు శృతి హాసన్ కూడా సినీ ఇండస్ట్రీలో ఒక గొప్ప హీరోయిన్ గా గుర్తింపు పొందుతోంది. కమలహాసన్ సినీ ఇండస్ట్రీలో ఒక మంచి నటుడిగా గుర్తింపు పొందడమే కాకుండా రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. ఇకపోతే కమల్ హాసన్ వివరాల గురించి ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే ఈ రోజు ఆయన పుట్టిన రోజు కాబట్టి ఆయన ఆస్తి వివరాలు కూడా ఒకసారి తెలుసుకుందాం..


కమలహాసన్ తమిళనాడు రాజకీయ పార్టీలో MNM అనే ఒక సొంత కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఇక ఇందులో ఆయన నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల విషయాలకు వస్తే.. రూ.176.93 కోట్లు విలువ చేయగలిగే ఆస్తులు ఉన్నట్లు కమలహాసన్ స్వయంగా అందులో పేర్కొన్నారు. ఇక చదువు విషయానికొస్తే కేవలం ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్య పోవడం జరిగింది. చదువు లేకపోయినా తన నటనతో , ప్రతిభతో సినిమాల ద్వారా ఇంత సంపాదించారు అని ఆయన శ్రేయోభిలాషులు చెప్పడం గమనార్హం.


ఇక లండన్ దేశంలో రూ.2.50 కోట్ల విలువ గల ఖరీదైన ఒక  ఇల్లు, రూ.2.7 కోట్ల రూపాయలు విలువ గల లెక్సస్  కారు, ఒక కోటి రూపాయల విలువ గల  బీఎండబ్ల్యూ కారు ఉన్నట్లు కమలహాసన్ అఫిడవిట్ లో  తెలిపారు. కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేయడానికి నామినేషన్ వేసినప్పుడు ఆయన అఫిడవిట్లో ఈ ఆస్తుల వివరాలను తెలియజేశారు. అంతేకాదు వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా కమల్ హాసన్ బాగానే సంపాదించాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ సంపాదనే కాదు శృతిహాసన్ సంపాదన కూడా కొన్ని కోట్ల రూపాయలు లోనే ఉంటుంది అని ఇండస్ట్రీ వర్గాలు వినికిడి.

మరింత సమాచారం తెలుసుకోండి: