ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా పుష్ప డిసెంబర్ 17న ప్రేక్షకాభిమానులు ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన పుష్ప మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా సుకుమార్ దర్శకత్వం వహించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ చాలా ఏరియాల్లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

భారీ పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అయిన పుష్ప సినిమాని తనదైన సూపర్బ్ స్టైల్ లో దర్శకడు సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించగా పుష్పరాజు పాత్రలో హీరో అల్లు అర్జున్ సహజత్వ నటన ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుంది. మాస్ యాక్షన్ కం ఎమోషనల్ రస్టిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పుష్పలో హీరోయిన్ రష్మిక మందన్న ఆకట్టుకునే పెర్ఫార్మన్స్, దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్, బీజీఎమ్, కెమెరా మ్యాన్ క్యూబా అందించిన విజువల్స్ తో పాటు భారీ నిర్మాణ విలువలు మరింత ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాపై ఇప్పటికే పలువురు సినిమా ప్రముఖులు సైతం పొగడ్తలు కురిపిస్తుండగా, 7జి బృందావన్ కాలనీ మూవీతో మంచి క్రేజ్ అందుకున్న సెల్వ రాఘవన్ కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పుష్ప పై ప్రశంసలు కురిపించారు.

నేడు పుష్ప మూవీ చూసాను, దర్శకుడు సుకుమార్ మూవీని ఎంతో అద్భుతంగా తీశారు, ప్రతి ఒక్క పాత్ర సహజత్వానికి ఎంతో దగ్గరగా ఉండడంతో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీ సాంగ్స్, బీజీఎమ్ ఎంతో బాగున్నాయని, ముఖ్యంగా పుష్పరాజుగా అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ అయితే యావత్ సినిమా మొత్తానికి పెద్ద అసెట్ అని సెల్వ రాఘవన్ తన పోస్ట్ ద్వారా తెలిపారు. మొత్తంగా అందరి నుండి మంచి ప్రశంసలతో పాటు కలెక్షన్స్ కూడా కుమ్మేస్తున్న పుష్ప, నిన్న ప్రముఖ ఒటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయి మంచి వ్యూస్ రాబడుతున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: