టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోయిన్ తమన్నా. సినిమా పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు దాటుతున్న కూడా ఈ ముద్దుగుమ్మకు భారీ స్థాయిలో ప్రేక్షకుల నుంచి క్రేజ్ దక్కుతుంది అంటే ఆమెకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా ఇప్పుడు కుర్ర హీరోయిన్లు ఎంత మంది వచ్చినా ఆమెకు క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా సినిమా చేస్తూనే ఉంది. కాలం మారుతున్న కొద్దీ ట్రెండ్ మారుతున్న కొద్దీ ఆమె యొక్క నటన శైలిని మార్చుకుంటూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వచ్చింది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ఓ సినిమాలో నటిస్తూనే మరోవైపు యంగ్ హీరో సత్యదేవ్ సరసన కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకో వైపు ఆమె ఐటం సాంగ్ లో కూడా చేస్తూ ప్రేక్షకులను భారీ స్థాయిలో తన అందచందాలతో మెప్పిస్తుంది. కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని విధంగా గ్లామర్ షో చేస్తూ ఈ విధంగా ఈమె సినిమాలలో చేస్తూ ఉంది. అంతేకాదు పోటీ లో ప్రసారమయ్యే సినిమా లో సైతం ఈమె నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. 

ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్ లలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఓ టీ టీ ప్రేక్షకులను సైతం మెప్పించింది అంటే ఈమె లో నటించాలన్న ఆసక్తి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు బాగా రావడానికి కారణం నిజంగా ఆమె పట్టుదల కృషి అని చెప్పవచ్చు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేసే తమన్నా మరికొన్ని రోజులు ప్రేక్షకులను అలరించే సినిమాల్లో నటించాలని చెప్పి ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ముద్దుగుమ్మకు ఆయా సినిమాలు క్రేజ్ ను తీసుకు వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: