మన టాలీవుడ్ లో అపజయం అనేదే ఎరుగని దర్శకుడు ఎవరున్నారు అని అడిగితె టక్కుమని మనకి గుర్తుకు వచ్చే పేరు SS రాజమౌళి.ఇకపోతే బాహుబలి మరియు #RRR సినిమాలతో ఆయన ఖ్యాతి ప్రపంచం నలుమూలల వ్యాపించింది.అయితే నేడు రాజమౌళి సినిమా ఒక్కసారి అయినా నటిస్తే బాగుండును అని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ప్రతి ఒక్క సూపర్ స్టార్ కి కోరిక ఉంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇకపోతే సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ ని ఆరంభించిన ఒక వ్యక్తి నేడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే నెంబర్ 1 డైరెక్టర్ గా నిలిచాడంటే మాములు విషయం కాదు.ఇక ఆయన ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక్క గుణపాఠం లాంటిది అని చెప్పొచ్చు.

అయితే ఇక  రాజమౌళి కెరీర్ లో ఇప్పటి వరుకు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అనే మనం అనుకుంటూ ఉన్నాము.పోతే ఒక్క సినిమా మాత్రం సూపర్ హిట్ అయ్యినప్పటికీ కూడా ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయింది.కాగా ఆ సినిమానే నితిన్ హీరో గా రాజమోళి దర్శకత్వం లో తెరకెక్కిన సై సినిమా.ఇకపోతే మన తెలుగు వాళ్లకి అసలు తెలియని ఆట రగ్బీ గేమ్ ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది.కాగా జూనియర్ ఎన్టీఆర్ తో సింహాద్రి వంటి సెన్సషనల్ హిట్ సినిమాని తీసిన తర్వాత రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించాడు.

అయితే కథ కథనం మరియు టేకింగ్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నప్పటికీ ఎందుకో ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం రాజమౌళి గత చిత్రం సింహాద్రి రేంజ్ లో వసూళ్లను రాబట్టలేకపోయింది.ఇక ఈ సినిమా అప్పట్లో 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అట.అయితే ఇది ఇలా ఉండగా ఈ సినిమాని అప్పట్లో రాజమౌళి తొలుత ఉదయ్ కిరణ్ ని హీరో గా పెట్టి తీద్దాం అనుకున్నాడట.కాగా  అప్పటికే ఉదయ్ కిరణ్ వేరే సినిమాలతో బిజీ గా ఉండడం తో రాజమౌళి కి డేట్స్ కేటాయంచలేకపోయాడట.ఇక అలా ఉదయ్ కిరణ్ ఒక్క సూపర్ హిట్ సినిమాని మిస్ అయ్యాడని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త.

మరింత సమాచారం తెలుసుకోండి: