నాగార్జున- ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్లో రూపొందిన 'ది ఘోస్ట్' మూవీ అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిందట.


ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈరోజు రిలీజ్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసి సినిమా కచ్చితం గా చూడాలి అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో మరింత పెంచారట మేకర్స్. అనంతరం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసింది చిత్ర బృందం.


ఇందు లో భాగం గా ఓ రిపోర్టర్ నాగార్జున ని వింత ప్రశ్న అడిగాడు. దానికి నాగార్జున ఇచ్చిన ఆన్సర్ హైలెట్ గా నిలిచింది. విషయం ఏంటి అంటే.. 'సినిమాల్లో మీకు గర్ల్స్ తో రొమాన్స్ చేయడం ఇష్టమా లేక గన్ తో ఫైరింగ్ చేయడం ఇష్టమా' అంటూ నాగార్జునని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడట.. దీనికి నాగార్జున కాసేపు నవ్వుకు ని 'ఒక చేతిలో అమ్మాయి ఇంకో చేతిలో గన్ ఉంటే నాకు ఇష్టం' అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడట.


 


దీంతో అక్కడ ఫన్నీ వాతావరణం ఏర్పడింది. అనంతరం 'ది ఘోస్ట్' మూవీ చాలా బాగా వచ్చిందని, తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందు లో ఉన్నాయ ని నాగార్జున అన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కూడా 'ది ఘోస్ట్ తో నాగార్జున గారు ఒక యాక్షన్ విజువల్ ఫీస్ట్ ని ఇవ్వబోతున్నారు. సినిమా కోసం చాలా ఎక్సయిట్ గా ఎదురుచూస్తున్నాం.


 


మేము ఫైనల్ కాపీ చూసుకున్నపుడు ఎంత ఎక్సయిట్ అయ్యమో ఆ ఎక్సయిట్మెంట్ ప్రేక్షకులకు కూడా వస్తుందని నమ్ముతున్నాను. విజయదశమి రోజు ది ఘోస్ట్ వస్తోంది. మీ అందరి మనసులని గెలుచుకుంటుందని బిగ్ స్క్రీన్ పై సినిమాని ఎంజాయ్ చేయాలి' అంటూ చెప్పుకొచ్చాడ ట.మరి చూడాలి నాగార్జున సినిమా ఎలా ఉందొ.

మరింత సమాచారం తెలుసుకోండి: