ఈ జనరేషన్ కుర్రాళ్లకు సుమ యాంకర్ గానే  బాగా తెలుసు. కానీ ఆమె కెరీర్ మొదలైంది హీరోయిన్ గా. దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు సినిమాతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు.

కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీలో సుమ హీరోయిన్ గా నటించారు. మరి ఈ మూవీ హీరో ఎవరో తెలుసా… నేటి స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ వక్కంతం వంశీ. హీరో కావాలనే కలలతో పరిశ్రమకు వచ్చిన వక్కంతం వంశీ కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ దక్కించుకున్నారు ఈ సినిమా లో,. దాసరి నారాయణరావు దర్శకుడు కావడంతో… సూపర్ హిట్ ఖాయం అనుకున్నారా

వాళ్ళ అంచనాలు, ఆశలు తలకిందులయ్యాయి. కళ్యాణ ప్రాప్తిరస్తు డిజాస్టర్ అయ్యింది. ఆ దెబ్బతో సుమ, వక్కంతం వంశీ కలలకు గండి పడింది. సుమ కనీసం మలయాళంలో రెండు మూడు సినిమాలు హీరోయిన్ గా చేశారు అంటా. వంశీ మాత్రం ఇక యాక్టింగ్ జోలికి పోలేదు అంటా మరి. ఆయన రైటర్ గా సెటిల్ అయ్యారు. కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీలో సుమ-వంశీ జంటగా నటించారు. సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ పంచారు. ఆ సినిమా ఫైల్యూర్ తర్వాత తమ బలం ఏమిటో తెలుసుకున్న వీరిద్దరూ ఒకరు యాంకర్ గా మరొకరు రైటర్ గా సెటిలయ్యారు.

సుమ తిరుగులేని యాంకర్ గా మకుటం లేని మహారాణిగా బుల్లితెరను ఏలుతున్నారు అని చెప్పొచ్చు. రెండు దశాబ్దాలుగా ఆమెకు పోటీ ఇచ్చే మరో యాంకర్ రాలేదు. ఒక స్టార్ హీరో రేంజ్ సంపాదన సుమ  తన సొంతం. అప్పుడప్పుడు క్యామియో రోల్స్ తో నటించాలనే తన కోరిక తీర్చుకుంటారు. చాలా కాలం తర్వాత జయమ్మ పంచాయితీ మూవీలో లీడ్ రోల్ చేశారు. కమర్షియల్ గా ఆడకున్నా జయమ్మ పంచాయితీ మంచి చిత్రమన్న పేరొచ్చింది. ముఖ్యంగా జయమ్మ పాత్రలో సుమ ఆకట్టుకున్నారు.

ఇక వక్కంతం వంశీ కిక్, రేసు గుర్రం, టెంపర్ వంటి హిట్ చిత్రాలకు కథలు అందించారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీతో దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకున్నారు ఈనటుడు.అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా ఆడితే వంశీ గ్రాఫ్ పెరిగేది. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో దర్శకుడిగా గ్యాప్ వచ్చింది. తాజాగా హీరో నితిన్ తో ఒక మూవీ ప్రకటించాడు. దర్శకుడిగా సత్తా చాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇవ్వలేని హిట్ నితిన్ ఇస్తాడని ఆశపడుతున్నారు మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: