నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి అనే అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి మెప్పించారు  మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి తమన్ సంగీతం అందించగా , హనీ రోజి ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది.

మూవీ ని ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రస్తుతం ఓవర్సీస్ లో కూడా డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే వీర సింహా రెడ్డి మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేసరికి ఓవర్సీస్ లో ఏ ఏరియా నుండి ఏ రేంజ్ కలెక్షన్ లు లభించాయో తెలుసుకుందాం.

ఫస్ట్ వీకెండ్ లో యుఎస్ఎలో వీర సింహా రెడ్డి మూవీ కి 8.19 కోట్ల కలెక్షన్ లు దక్కగా ,  ఆస్ట్రేలియాలో 84.2 లాక్స్ ,  న్యూజిలాండ్ లో 4.09 లాక్స్ , యూకే లో 99.12 లాక్స్ , యూఏఈ లో 45 లక్షలు , రెస్ట్ ఆఫ్ జి సి సి లో 23 లక్షలు , రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 50 లక్షలు కనెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ఓవర్సీస్ లో ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేసరికి 11.21 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇలా ఫస్ట్ వీకెండ్ లో వీర సింహా రెడ్డి మూవీ  ఓవర్సీస్ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: