డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన లైగర్ సినిమా ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా షూటింగ్ మొదల నుంచి ఛార్మి దగ్గరుండి కూడా చూసుకొని ఈ సినిమాకు మంచి హైపును తీసుకువచ్చింది. లైగర్ నష్టాలకు సంబంధించి పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు తప్ప చార్మి ఎక్కడ కూడా హైలైట్ గా మారలేదు. ఆ తర్వాత చార్మి దాదాపుగా ఎక్కడ ఈమె పెద్దగా కనిపించలేదు. కానీ ఇప్పుడు తాజాగా ఎయిర్పోర్టులో మళ్లీ పూరి జగన్నాథ్ చారిని జంటగా కనిపించడం జరిగింది.


అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. దీంతో ఈ జంట ముంబాయికి ఎందుకు వెళ్లినట్లు అంటూ సందేహాలు కూడా మొదలవుతున్నాయి. మళ్లీ మఖం ముంబైలో వేయబోతున్నారా ఏదైనా బాలీవుడ్ సినిమా కోసమా అన్నట్లుగా క్లారిటీ తెలియాల్సి ఉంది. కారణాలు ఏవైనా సరే ముంబైలో కనిపించేసరికి అభిమానులు ఫుల్ జోష్ మొదలయ్యింది. ఇప్పుడు సీరియస్ గానే ఏదో ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. లైగర్ ప్రారంభం నుంచి షూటింగ్ వరకు అంతా కూడా ముంబైలోనే ప్లాన్ చేశారు.


సినిమా రిలీజ్ వరకు పూరి ,ఛార్మి హైదరాబాద్కు రాలేదు కేవలం ప్రచారం కోసమే మళ్లీ వెళ్ళిపోయారు. నార్త్ రాష్ట్రాలలోని ఈ సినిమా కూడా ఎక్కువగా ప్రమోట్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా కోసం ముంబైకి మకాం కూడా మార్చేశారు .ఇక హైదరాబాదుకు వచ్చేది లేదని అన్ని ముంబైలోనే కొనసాగిస్తారని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో  ఒక్కసారిగా అవన్నీ తలకిందులు అయ్యాయి మళ్లీ హైదరాబాద్ తిరిగి వచ్చి ఇక్కడి నుంచి పనులన్నీ మొదలుపెట్టబోతున్నారు. మరి తాజాగా ముంబైకి వెళ్లడం వెనుక వీరి మరణం ఏంటి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వీరికి సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: