సుమంత్ ప్రభాస్ అనే యువ నటుడు తాజాగా మేము ఫేమస్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ నటుడు యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని మేము ఫేమస్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో ఈ నటుడు హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకుడుగా కూడా వహించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనే రేంజ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుంటాం. ఈ మూవీ నైజాం ఏరియాలో 5 రోజుల్లో 1.92 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , ఏపీ మరియు సీడెడ్ ఏరియాలో కలుపుకొని 1.26 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. రిమైనింగ్ ప్రాంతాలలో ఈ మూవీ 96 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.02 కోట్ల షేర్ ... 4.14 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 2.20 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచవ్యాప్తంగా సాధించినట్లు అయితే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఈ మూవీ మరో 18 లక్షల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు అయితే క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: