
మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ సినిమా ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ సినిమా. మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమా గా ఈ ప్రాజెక్టు తెరకెక్కుతోంది. ఈ సినిమా థియేటర్లలోకి రావాలంటే ఎలా లేదన్నా మరో రెండేళ్లు టైం పట్టేలా ఉంది. ఈ గ్యాప్ లో మహేష్ ఫ్యాన్స్ తమ హీరో పాత సినిమాలు రీ రిలీజ్ చేయించుకుని వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే మహేష్ పాత సినిమాలు రీ రిలీజ్ అయినా కూడా థియేటర్ల లో మంచి వసూల్లు రాబడుతున్నాయి. ఇప్పటికే మహేష్ నటించిన పలు సినిమాలు రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే మహేష్ నటించిన సినిమాల్లో ఖలేజా సినిమా కు ఎప్పటకీ ఉండే హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా కు ఇప్పటకీ మంచి ఖల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా రీ రిలీజ్ విషయం లో కూడా కేవలం మహేష్ బాబు అభిమానులే కాకుండా .. మిగిలిన హీరోల అభిమానులు .. తెలుగు సినీ అభిమానులు ప్రతి ఒక్కరి లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా ను మే 30 కి ప్లాన్ చేసుకున్నారు .. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఖలేజా రీ రిలీజ్ ఇప్పుడు వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త నిరాశ లో ఉన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు