
ఇక రెండు దేశాలు కలిసి ఉన్న అఖండ భారత్ లో కరాచీ కూడా ఓ నగరం. దేశ విభజన జరగకముందు కరాచీ కూడా దేశ ప్రముఖ నగరాల్లో ఒకటి గా ఉండేది. అక్కడ స్పెషల్ ఏంటంటే బేకరి. అయితే దేశ విభజన జరిగాక వారు ఇక్కడకు వచ్చేసి అదే కరాచీ బేకరీ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. దాన్ని విస్తరించుకుని ఇక్కడ పాపులర్ అయ్యారు. అయితే వారు దేశ భక్తి చాలా మెండుగా ఉన్న వారు.. అసలు పాకిస్తాన్‌కు .. కరాచీకి సంబంధమే లేదు. కాకపోతే అక్కడ పేరుతో పాపులర్ అయ్యింది. అయితే కొందరు చేసే పనుల వల్ల భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన ప్రతిసారి ఈ బేకరీలను టార్గెట్ చేస్తున్నారు. తాజా వార్ నేపథ్యంలో విశాఖలో కూడా కరాచీ బేకరిపై కొంత మంది దాడి చేసినంత ప్రయత్నం చేశారు. తన వ్యాపార సంస్థపై జరుగుతున్న ప్రచారం తో వారు ఎప్పటికప్పుడు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ఇకపై అయినా తమ షాపులపై దాడులు ఆపాలని వారు కోరుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు