రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో ఇప్పటికీ కూడా బోర్ కొట్టని సినిమా ఛత్రపతి.ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి సినిమా ఇది. ఈ సినిమాలో ఉన్నటువంటి ఫస్ట్ హాఫ్ , ఇప్పటి వరకు రాజమౌళి తీసిన అన్నీ సినిమాలకంటే కూడా ది బెస్ట్ అని చెప్పాలి.. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మాస్ ఆడియన్స్ కి ఒక పండగలాగా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే సెంటిమెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా అలరించేలా ఉంటుంది. అప్పటి వరకు నార్మల్ హీరోగా ఉన్న ప్రభాస్  ని స్టార్ హీరో గా చేసింది ఈ సినిమా.. టాలీవుడ్ మాస్ హీరోలలో ఒకడిగా ఆయన స్థిరపడిపోయాడు.

ప్రభాస్ మూడవ చిత్రం 'వర్షం' ఆరోజుల్లో 17 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.. కానీ ఛత్రపతి చిత్రం మాత్రం కేవలం 14 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత హై సెకండ్ హాఫ్ లో లేకపోవడమే అందుకు కారణమని తెలుస్తుంది.. అయితే ఈ సినిమాని మొదట రాజమౌళి మాస్ మహారాజ రవితేజ తో చేద్దాం అని అనుకున్నాడట. కానీ ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే అలవాటు ఉన్న రవితేజ డేట్స్ మొత్తం నిండిపోయింది. దాంతో ఈ చిత్రాన్ని ప్రభాస్ తో చేద్దాం అనుకున్నాడటా రాజమౌళి. కానీ ఆయన దగ్గరకి వెళ్ళాలి అంటే మాత్రం భయం. ఎందుకంటే గతం లో ఆయన స్టూడెంట్ నెంబర్ 1 మరియు సింహాద్రి సినిమాలను ఇలాగే రిజెక్ట్ చేసాడని సమాచారం.ఇప్పుడు కూడా అలాగే రిజెక్ట్ చేస్తాడులే అని అనుకున్నాడట. కానీ ఒకరోజు ప్రభాస్ తన బర్త్ డే పార్టీ కి టాలీవుడ్ స్టార్ హీరోలు మరియు నిర్మాతలను కూడా ఆహ్వానించాడట. అలా ఆహ్వానం అందుకున్న వారిలో రాజమౌళి కూడా ఒకడు. ఎలాగో వచ్చాము కదా అడిగేద్దాం అని నా దగ్గర ఒక స్టోరీ ఉంది, నీకు సరిగ్గా సరిపోతుంది వింటావా అని ప్రభాస్ ని అడిగాడు రాజమౌళి. వచ్చేయ్ డార్లింగ్ స్టోరీ సిట్టింగ్ వేద్దాం అన్నాడట. ఆ మరుసటి రోజు రాజమౌళి ప్రభాస్ ఇంటికి వెళ్లి స్టోరీ చెప్పడం అలాగే ఆయనకీ బాగా నచ్చి వెంటనే ఓకే చెయ్యడం, ఇలా అన్నీ కూడా స్పీడ్ గా జరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: