నందమూరి హీరోల సినిమాల కి అలాగే మెగా హీరోల సినిమాల కి మధ్య ఓ మంచి పోటీ అయితే ఉంటుంది. ఈ ఏడాది 'వీరసింహారెడ్డి' మరియు 'వాల్తేరు వీరయ్య' వంటి సినిమాలు సంక్రాంతి కే విడుదల అయ్యి మంచి విజయం సాధించాయి..

చిరంజీవి- బాలకృష్ణ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే.నందమూరి హీరో అయిన ఎన్టీఆర్ కి అలాగే మెగా హీరో అయిన రాంచరణ్ కి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కూడా ఉంది. అందుకే 'ఆర్.ఆర్.ఆర్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఈ కాంబినేషన్లో అయితే రూపొందింది.

వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కనుక లేకపోతే 'ఆర్.ఆర్.ఆర్' తీయాలనే ఆలోచన తనకు వచ్చేది కాదు అని రాజమౌళి ఓ సందర్భం లో కూడా చెప్పుకొచ్చాడు. 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత వీళ్ళ ఫ్రెండ్ షిప్ అలాగే కంటిన్యూ అయ్యింది.. రచయిత మరియు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ అయితే 'ఆర్.ఆర్.ఆర్ 2 ' కూడా ఉంటుందని అయితే చెప్పుకొచ్చారు. అభిమానులు కూడా అది నిజం కావాలని బాగా కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. 'ఆర్.ఆర్.ఆర్' ప్రమోషన్స్ సమయం లో ఎన్టీఆర్.. చిరంజీవి గారు నటించిన సినిమాల్లో తనకు ఇష్టమైన సినిమా ఏంటి అని అడుగ గా ఒక సినిమా గురించి తెలిపాడు. చిరంజీవి సినిమాల్లో తనకు రుద్రవీణ సినిమా అంటే  తన కి బాగా ఇష్టమట. అది పెద్దగా ఆడిన సినిమా మాత్రం కాదు. కానీ ఓ స్టార్‌ హీరో అయ్యుండి కూడా.. చిరంజీవి గారు అలాంటి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ప్రతి నటుడి కి ఉండాల్సిన తపన అది అని మనలోని నటుడ్ని సంతృప్తి పరచడం అనేది ఎంతో కష్టమైన పని'' అంటూ ఎన్టీఆర్ చిరంజీవి గురించి చెప్పుకొచ్చాడు. అప్పుడు ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: