టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ కి ఒక గుర్తింపు ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి ఎవరైనా హీరో వస్తే చాలు అభిమానులు అదే స్థాయిలో ఆదరిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోలకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, ధరమ్ తేజ్, ఇలా ఎవరు వచ్చినా సరే టాలీవుడ్ ప్రేక్షకులు మెగా ప్రేక్షకులు ఆదరించారు. అయితే ఒకరు మాత్రం ఆకట్టుకోవడం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా వచ్చిన నిహారిక పెద్దగా ఆకట్టుకోలేదు. 

 

ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా ఫ్లాపులు గానే ఉన్నాయి. ఆమె సోషల్ మీడియాలో మినహా పెద్దగా ఎక్కడా ఆకట్టుకోలేదు. దీనితో ఆమె హీరోయిన్ గా చేయడం అనవసరం అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఆమె సినిమాల నుంచి తప్పుకోవడం మంచిదని అంటున్నారు. అయితే ఆమెకు అవకాశాలు కూడా పెద్దగా ఈ మధ్య రావడం లేదు. దీనితో కావాలి అనే మెగా ఫ్యామిలీ ఆమెను వెనక్కు లాగుతుంది అంటున్నారు కొందరు. ముఖ్యంగా ఆమె హీరోయిన్ గా చేయడం చిరంజీవికి అసలు ఇష్టం లేదని అంటున్నారు.

 

ఆమె హీరోయిన్ గా అవసరం లేదు అనేది కొందరి మాట. ఆ విషయం చిరంజీవి కి చెప్పారట. దీనితో చిరంజీవి కూడా నాగబాబుకి ఈ విషయం చెప్పినట్టు సమాచారం. దీనితోనే ఆమె అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా సరే దర్శక నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని టాక్. చిరంజీవికి అసలు ఇష్టం లేదని ఆమె కాస్త హాట్ గా పోస్ట్ చేసిన ఫోటో పై కూడా చంద్రబాబు సీరియస్ అయ్యారని టాక్. దీనితో ఆమెకు త్వరలో పెళ్లి కూడా చేసే అవకాశం ఉంది అంటున్నారు కొందరు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: