ప్రస్తుతం లాక్ డౌన్  కొనసాగుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. తినడానికి కూడా తిండి లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎంతోమంది పేద ప్రజలకు సేవలు చేస్తున్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం పవన్ కళ్యాణ్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. అందరు హీరోలు లాక్ డౌన్  సమయంలో ఇంట్లో పనులు చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం తన అభిమానులకు ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. పేదలకు సేవ చేస్తున్న అభిమానులకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. 

 

 

 దీంతో పవన్ కళ్యాణ్ చేత సోషల్ మీడియాలో తమను గుర్తించేలా ఒక పోస్ట్ పట్టించుకోవాలని అభిమానులు అందరూ  పేద ప్రజలకు సేవలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రతి హీరో కూడా ఇలా తన అభిమానులు పేద ప్రజలకు సేవ చేయాలని ప్రోత్సహిస్తే  ఎంతో బాగుంటుంది అనిపించేలా  పవన్ కళ్యాణ్ అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. టాలీవుడ్ లోని మిగతా హీరోలు కూడా సినీ కార్మికులకు హెల్ప్ చేయడానికి ఏకంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టి సినీ కార్మికులకు రోజు వారి నిత్య అవసరాలు అందించిన విషయం తెలిసిందే. 

 

 

 అయితే టాలీవుడ్ లోని ప్రతి హీరోకి ఎంతోమంది అభిమానులు ఉంటారు కాబట్టి తన అభిమానులు కూడా ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో పేద ప్రజలకు సహాయం చేయాలని పిలుపునిస్తే ప్రతి ఒక అభిమాని పేద ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తారు అని ఎంతో మంది భావించారు. ఒకవేళ నిజంగానే అందరు హీరోలు అలా పిలుపునిస్తే పేదలకు కడుపునిండా ఆహారం దొరుకుతుంది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: