దసరా సందర్భంగా తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా విడుదలయ్యాయి. కానీ అందరి ఫోకస్ కూడా తెలుగు సినిమాల మీదే ఉండటంతో దసరా సీజన్లో ఇతర భాషల సినిమాలను ఎవరూ పట్టించుకోలేదు. కానీ దసరా సీజన్లో వచ్చిన తెలుగు సినిమాల కంటే ఓ తమిళ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అన్న వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కొంతమంది ఆ సినిమా చూసిన వారు చాలా బాగా సినిమా ఉంటుందని వారు వెల్లడిస్తున్నారు.

డబ్బింగ్ సినిమా కావడం వల్ల ఒక మంచి సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గర కాలేదనే చెప్పాలి. ఏదేమైనా ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సూపర్ హిట్ దిశగా ఇక్కడి వరకు రావడం మంచి పరిణామం.  ఇంతకీ ఆ సినిమా ఏంటి అని అనుకుంటున్నారా.. శివ కార్తికేయన్ హీరోగా తమిళనాడులో తెరకెక్కిన డాక్టర్ అనే సినిమా ను తెలుగులో వరుణ్ డాక్టర్ డబ్ చేశారు. ఈ చిత్రంలోని చెల్లమ్మ అనే సాంగ్ ఈ సినిమా పై మంచి క్రేజ్ నెలకొనేలా చేసింది. అంతేకాదు ఈ సినిమాకు ప్రచారం కాస్త తక్కువే అయినా కూడా మౌత్ టాక్ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేలా చేసింది అని చెప్పవచ్చు. 

అయితే శివ కార్తికేయన్ అభిమానులు వరకు మాత్రమే ఈ సినిమాను చూసి మొదట్లో మంచి టాక్ ను అందరికీ ప్రచారం చేశారని చెప్పవచ్చు. ఆ విధంగా ప్రేక్షకులకు ఈ సినిమా గురించి తెలిసి వారు కూడా వెళ్ళడం మొదలు పెడుతున్నారు. మొదటి భాగం హిలెరియస్ గా ఉందని, రెండవ భాగం ఎంతో సస్పెన్స్ గా ఉందని మొత్తానికి ఈ సినిమా దసరా సీజన్ లో వచ్చిన సినిమాలలో కెల్లా సూపర్ హిట్  అవుతుందని వారు చెబుతున్నారు. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా కాగా ఈ సినిమా దర్శకుడు అన్ని అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా తో వచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: