బుల్లితెరపై సుడిగాలి సుదీర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .. ఒక సాదాసీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బుల్లితెర సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. కేవలం కమెడియన్గా మాత్రమే కాకుండా డాన్సర్ గా మెజీషియన్ గా కూడా సుడిగాలి సుధీర్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే మిగితా జబర్దస్త్ కమెడియన్స్ తో పోల్చి చూస్తే సుడిగాలి సుధీర్ కి కాస్త ఎక్కువగా క్రేజ్ రావడానికి రష్మీ తో ఉన్న లవ్ ట్రాక్ కారణం అని చెప్పాలి. జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చిన నాటినుంచి రష్మీ తో లవ్ ట్రాక్ నడుపుతూ ఉండడంతో ఇక వీరిద్దరి జోడి అందరినీ ఆకర్షించింది అని చెప్పాలి.


 ఇక కొంత కాలంలోనే రష్మీ సుధీర్ డి జోడి బుల్లితెరపై ఫేవరెట్ జోడి గా మారిపోయింది. ఇక రష్మీ సుధీర్ ఎక్కడైనా కనిపించారు అంటే సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారి పోతూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక సుడిగాలి సుదీర్ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ఉండగా ఇక రష్మీ కూడా ఎక్స్ ట్రా జబర్దస్త్  లో యాంకర్ గా కొనసాగుతోంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పుడు ఒకరిపై ఒకరు పంచులు వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు సుధీర్ రష్మీ జంట. ఇక ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో కాస్త వైరల్ గా మారిపోయింది.



 ఈ క్రమంలోనే  సుదీర్ టీం ఒక స్పెషల్ స్కిట్ చేస్తుంది. స్కిట్ లో భాగంగా రష్మీ దగ్గరికి వెళ్లి వస్తావా అంటూ అడుగుతాడు సుడిగాలి సుదీర్. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది రష్మీ. మా ట్రావెల్స్ బాగుంటుంది మీరు వస్తారా లేకపోతే మమ్మల్ని వచ్చి పికప్ చేసుకో మంటారా అంటూ అడగడంతో అక్కడున్న వారందరూ నవ్వుకుంటారు. ఇక ఆ తర్వాత రోజాతో కలిసి ఒక స్పెషల్ స్కిట్ చేస్తాడు సుడిగాలి సుదీర్. ఈ క్రమంలోనే ఏకంగా రష్మీ దగ్గరికి వెళ్లి ఆంటీ అంటూ పిలవడంతో రష్మీ ఒక్కసారిగా షాక్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: