అందాల ముద్దుగుమ్మ సురభి గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ 2013 వ సంవత్సరంలో విడుదల అయిన 'ఇవన్ వేరే మాదిరి' అనే తమిళ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యింది. అలా తమిళ మూవీ ద్వారా వెండి తెరకు పరిచయం అయిన సురభి ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ ముద్దుగుమ్మ ఎక్స్ ప్రెస్ రాజా మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ లో శర్వానంద్ హీరోగా నటించగా , ఈ మూవీ కి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. ఎక్స్ ప్రెస్ రాజా మూవీ మంచి విజయం సాధించడం ,  అలాగే ఈ మూవీ లో సురభి నటనకు , అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించడంతో ఈ మూవీ తర్వాత సురభి కి అనేక టాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కాయి  అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ కూడా అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. 

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సురభి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వారితో అనేక విషయాలను  పంచుకుంటూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో తన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కొన్ని ఫోటోలను సురభి తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో సురభి వైట్ అండ్ వైట్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం సురభి కి సంబంధించిన ఈ ఫోటోలు నెటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: