టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా అనుపమ ప్రధాన పాత్రలో చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన కార్తికేయ2 ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఊహించని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.నార్త్ ఇండియాలో ఈ సినిమాకు థియేటర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. పుష్ప ది రైజ్ సినిమాకు కార్తికేయ2 సినిమాకు కొన్ని విషయాలకు సంబంధించి పోలికలు కూడా ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మొదట కార్తికేయ2 సినిమాకు హిందీలో పరిమితంగా థియేటర్లు అనేవి దక్కాయి.అయితే లాల్ సింగ్ చడ్డా ఇంకా రక్షా బంధన్ సినిమాలతో పోలిస్తే కార్తికేయ2 సినిమాకు చాలా బెటర్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలెక్షన్లు పెరగడంతో పాటు థియేటర్ల సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతోంది. కేవలం హిందీలోనే ఈ సినిమా ఫుల్ రన్ లో ఏకంగా 15 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇంకా అభిషేక్ పిక్చర్స్ నిర్మాతలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.


అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా కూడా మొదట ఏ మాత్రం అంచనాలు లేకుండా బాలీవుడ్ లో విడుదలైంది.ఆ తర్వాత మౌత్ టాక్ చాలా పాజిటివ్ గా స్ప్రెడ్ కావడంతో ఈ సినిమా ఏకంగా అక్కడ 100 కోట్ల రూపాయలకు పైగా హిందీలో గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచింది. పుష్ప ది రైజ్ బాలీవుడ్ లో చేసిన మ్యాజిక్ ను కార్తికేయ2 సినిమా రిపీట్ చేయడం గమనార్హం. దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాతో ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నారు.సరికొత్త కథ ఇంకా కథనంతో కార్తికేయ2 సినిమాను తెరకెక్కించడంతో చందూ మొండేటికి ఆఫర్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. పరిమిత బడ్జెట్ లోనే అద్భుతాలు చేసిన చందూ మొండేటి భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించే నిర్మాతలు కనుక దొరికితే స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారనడంలో అసలు సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: