
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికీ పదేళ్లు అవుతుంది. అయితే ఈ సందర్భంగా కుమారి 21 మూవీ మేకర్స్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కుమారి 21 మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సూపర్ హిట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మరోసారి భారీ కలక్షన్స్ ని రాబట్టనుంది.
హిట్ తో సంబంధం లేకుండా మంచి టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు సైతం మరోసారి రీరిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొడుతున్నాయి. ఈ కోవలో ఇప్పటికే హిట్ కొట్టిన మురారి, ఇంద్ర, గబ్బర్ సింగ్, భద్రి, హ్యాపీ డేస్ సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. అలాగే వాటితో పాటుగా ఫ్లాప్ అయిన సినిమాలు.. హీరో సిద్దార్థ్, బేబీ శ్యామలి తెరకెక్కించిన లవ్ స్టోరీ ఓయ్, రామ్ చరణ్ నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ ఆరెంజ్ సినిమాలు రీరిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తో పాటు కలక్షన్స్ కూడా బాగానే సొంతం చేసుకున్నాయి.