
టాలీవుడ్ యంగ్ టైగర్ .. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చేస్తున్న పలు సినిమాలలో ముందుగా రిలీజ్ అవుతున్న సినిమా వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ కు బాలీవుడ్ దర్శకుడు ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన్ బ్రహ్మాస్త ను సూపర్ డూపర్ హిట్ చేశారు. ఇక ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వచ్చిన టీజర్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆ తర్వాత నుంచి మేకర్స్ సినిమా ప్రమోషన్ల విషయంలో మరింత యాక్టివ్ అవుతున్నారు. తాజాగా దర్శకుడు ఆయన్ ముఖర్జీ షేర్ చేసిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వీటిలో మొదటగా ఎన్టీఆర్ ఆయన్ ముఖర్జీ కలిసి సెట్స్ లో కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ కు దర్శకుడు ఆయాన్ సన్నివేశాలను వివరిస్తున్నట్టుగా కనిపిస్తున్న ఈ ఫోటో లో ఎన్టీఆర్ మంచి డాషింగ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి తన వర్క్ ఎక్స్పీరియన్స్ ఫోటోలతో ఆయాన్ పంచుకున్నాడు. వార్ 2 స్క్రిప్ట్ తనని ఎంతో కదిలించింది అని ... అందుకే ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారని తెలుపుతూ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ - హీరోయిన్ కీయారా అద్వానిపై ఆయన షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు