
అయితే పవన్ కళ్యాణ్ నిజంగానే రూ.11 కోట్లు వెనక్కిచ్చారా అనే ప్రశ్నకు మాత్రం ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పారితోషికం 70 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే. వేర్వేరు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కు రెమ్యునరేషన్ రూపంలో 11 కోట్ల రూపాయలు దక్కడం వాస్తవమే అని తెలుస్తోంది. అయితే మిగతా రెమ్యునరేషన్ ను మాత్రం పవన్ ఇప్పటివరకు తీసుకోలేదు.
పవన్ ను ఈ మధ్య కాలంలో ఏఎం రత్నం కలవలేదని ప్రస్తుతానికి అయితే 11 కోట్ల రూపాయల వార్తల్లో స్పష్టత లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ రెమ్యునరేషన్ వెనక్కిచ్చినా ఇవ్వకపోయినా ఈ సినిమా కోసం దాదాపుగా 60 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను వదులుకోవడం గొప్ప విషయం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో పవన్ నిజంగా గ్రేట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ పవన్ ఇచ్చిన కమిట్మెంట్లకు అనుగుణంగా సినిమాలను పూర్తి చేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు చాలా అరుదుగా ఉంటారని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా బిజినెస్ కు సంబంధించి జరిగిన ప్రచారంలో సైతం పూర్తిస్థాయిలో నిజం లేదని తెలుస్తోంది.