
"మనం" సినిమాలో నాగార్జున - అమల - అక్కినేని నాగచైతన్య - అఖిల్ - నాగేశ్వరరావు కలిసి నటించి మెప్పించారు . అంతేకాదు అప్పటికే కోడలు కాకపోయినా కోడలు కాబోతున్న సమంత కూడా అందులో భాగమైంది . ఈ సినిమా అక్కినేని అభిమానులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది . అయితే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ తర్వాత మరొకసారి ఇండస్ట్రీలో అలాంటి రికార్డ్ సొంతం చేసుకోబోతుంది మంచు ఫ్యామిలీ. మంచు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి "కన్నప్ప" సినిమాలో నటిస్తున్నారు. మంచు నుండి మరో ఉత్తరం వెండితెరపై మెరవడానికి సిద్ధమైంది .
మోహన్ బాబు మనవడు విష్ణు తనయుడు కన్నప్ప చిత్రంలో బాల నటుడిగా పరిచయం అవుతున్నాడు . ఇప్పటికే ఈ సినిమాలో విష్ణు ఇద్దరు కూతుర్లు నటిస్తున్నారు . దానికి సంబంధించిన పిక్స్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి . ఇప్పుడు విష్ణు కొడుకు కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నాడు. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ మూమెంట్ లోనే మంచు విష్ణు మూడోతరం వారసుడు ఎంట్రీ పై సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు . "నా కొడుకు కన్నప్ప సినిమాతో అరంగేట్రం చేస్తున్నాడు. అతడు సెట్లో అడుగుపెట్టడం తన డైలాగ్స్ చెప్పడం ..నటించడం నా జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణాలు" అంటూ ఒక తండ్రికి ఇంతకన్నా ఏం కావాలి అంటూ ఎమోషనల్ గా ట్విట్ చేశారు . అంతేకాదు అక్కినేని ఫ్యామిలీ తర్వాత ఇండస్ట్రిలో అలాంటి క్రేజీ రికార్డ్ అందుకోబోతుంది మంచు ఫ్యామిలీ మాత్రమే అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు రకరకాలగా మంచు ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నారు . చూడాలి మరి కన్నప్ప సినిమా మంచు ఫ్యామిలీకి ఎలాంటి గుడ్ లక్ తీసుకొస్తుందో..???