
టాలీవుడ్ మంచు ఫ్యామిలీ వారసుడు ... మంచు విష్ణు హీరోగా నటించిన అవైటెడ్ భారీ పాన్ ఇండియా సినిమా “కన్నప్ప”. వివిధ భాషలకు చెందిన స్టార్ హీరోలు అందరూ ... అగ్ర తారలు కలిసి నటించిన ఈ సినిమా కు బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ హిస్టారికల్ డ్రామా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య థియేటర్ల లోకి వచ్చింది. ఇక ఈ సినిమా కు విష్ణు కెరీర్ లోనే ది బెస్ట్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
ఇక తన కెరీర్ లోనే వరల్డ్ వైడ్ గా మంచి ఓపెనింగ్స్ డే 1 గా కన్నప్ప రికార్డుల్లో కి ఎక్కుతుందని కూడా ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో రు. 15 కోట్లకు పైగా నే వరల్డ్ వైడ్ కన్నప్పకు తొలి రోజు వసూళ్లు వస్తాయని అంటున్నారు. ఇక ఈ సినిమా లో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ లాంటి స్టార్స్ నటించగా మోహన్ బాబు నిర్మాణం వహించారు. ఈ సినిమా లో మంచు విష్ణు నలుగురు పిల్లలు కూడా కీలక పాత్రల లో నటించారు. ఇక రు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు