
అందరి డైరెక్టర్ లు వేరు శేఖర్ కమ్ముల వేరు. శేఖర్ కమ్ముల హీరోయిన్ విషయంలో ఎప్పుడూ ఓవర్గా మాట్లాడడు. పొగడడు . ఎంత ఉంటే అంతే పొగుడుతాడు. కానీ రష్మిక మందన్నాని మాత్రం ఆమె చాలా చాలా మంచి యాక్టర్ అని సినిమా కోసం ఎలాంటి సీన్స్ అయినా చేస్తుంది అని కష్టపడుతుంది అని స్టేజిపై బాగా ప్రశంసలు కురిపించారు. దీంతో ఆమె పేరు మారుమ్రోగిపోతుంది . రీసెంట్ గా రష్మిక మందన్న కుబేర సినిమాలో నటించింది . ఆమె పెర్ఫార్మెన్స్ బాగా మెప్పించింది .
అయితే గతంలో ఓ హీరోయిన్ లైఫ్ లో జరిగిన్నట్టే రష్మిక లైఫ్ లో కూడా జరుగుతుంది అన్న వార్త ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతుంది. గతంలో హీరోయిన్ సమంత ఏ విధంగా అయితే ఫ్లాప్స్ లేకుండా ఫుల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ స్వింగ్ లో ఉండిందో ఇప్పుడు రష్మిక కూడా అలానే ఉంది అని.. గతంలో నాగచైతన్య - సమంతల ప్రేమాయణం లాగే ఇప్పుడు విజయ్ దేవరకొండ - రష్మిక ప్రేమాయణం కొనసాగుతుంది అని మీడియాలోఅప్పుడు నాగచైతన్య - సమంత ఎంత హైలెట్ అయ్యారో అంతకు డబుల్ రేంజ్ లో ఇప్పుడు రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ హైలైట్ అవుతున్నారు అని.. సమంత లైఫ్ లో జరిగినట్లే రష్మిక లైఫ్ లో కూడా జరుగుతుంది అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దీనితో రష్మిక - సమంతల పేర్లు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!