అందంలో సహజం.. ప్రేమలో అసాధారణం.. భక్తిలో పారవశ్యం.. కన్నప్పకు సర్వస్వం.. ఈ నెమలి అంటూ చిత్ర బృందం ప్రీతిని పరిచయం చేసిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నెమలిగా ప్రీతి ముకుందన్ మంచు విష్ణుతో రొమాన్స్ చేయడమే కాకుండా కత్తి విన్యాసాలు, యుద్ధాలు, యాక్షన్ సీక్వెన్స్ లో కూడా కనిపించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది.
ప్రీతి ముకుందన్ బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే.. ఈమె తమిళనాడులోని తిరుచ్చిలో జన్మించింది. ఇంజినీరింగ్ లో బీటెక్ కంప్లీట్ చేసింది. చిన్న వయసు నుంచి భరతనాట్యంలో శిక్షణ పొందింది. అలాగే హిప్ హాప్, జానపద నృత్యంలోనూ ప్రావీణ్యం పొందింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో తన నృత్య నైపుణ్యాలతో ఆకట్టుకుంది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ లోకి ప్రవేశించిన ప్రీతి ముకుందన్.. పలు టీవీ యాడ్స్ మరియు వార్త ప్రకటనల్లో మెరిసింది. మ్యూజిక్ ఆల్బమ్స్ లో వర్క్ చేసింది. ఆమె చెసిన `ముత్తు ము2` అనే సాంగ్ కి యూట్యూబ్ లో ఆరు మిలియన్స్ కి పైగా వ్యూస్ ఉన్నాయి.అలా వచ్చిన గుర్తింపుతోనే వెండితెరపై అడుగుపెట్టింది. తెలుగులో కన్నప్పనే ప్రీతి ముకుందన్ తొలి సినిమా అనుకుంటారు. కానీ కాదు.. కన్నప్ప కన్న ముందే శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన కామెడీ హారర్ ఫిల్మ్ `ఓం భీమ్ బుష్(2024)` తో ప్రీతి టాలీవుడ్ తో పాటు వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది `స్టార్` అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఇక కన్నప్పలో మొదట కృతి సనన్ చెల్లెలు నూపుర్ సనన్ ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. అయితే ఆమె సడెన్ గా తప్పుకోవడంతో ఆడీషన్ లో మెప్పించిన ప్రీతి ముకుందన్ ను నెమలి పాత్రకు ఖరారు చేశారు. దాంతో రెండో సినిమాకే ప్రభాస్ తో స్క్రీన్ చేసుకునే అదృష్టం ప్రీతికి దక్కింది. కన్నప్ప విజయవంతం కావడంతో ప్రీతి ముకుందన్ కు టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు తలుపు తట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి