`ఉప్పెన` వంటి బ్లాక్ బస్టర్ మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు సానా.. తన రెండో సినిమాను ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పట్టాలెక్కించాడు. అదే `పెద్ది`. జాన్వీ కపూర్ హీరోయిన్. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల‌ను పోషిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్‌ బ్యానర్లపై సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో పెద్ది చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ. ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.


ఇప్పటికే బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. ప‌ల్లెటూరు బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న పెద్ది 2026 మార్చి 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుగుతోంది. అయితే రీసెంట్ గా ఫ్యాన్ మీట్‌లో పెద్ది సినిమాపై రామ్ చ‌ర‌ణ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.


`పెద్ది గ్లింప్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్ప‌టివ‌ర‌కు నేను చేసినదాంట్లో పెద్ది ఒక యూనిక్ స్క్రిప్ట్. బ‌హుశా రంగస్థలం, ఆర్ఆర్ఆర్ చిత్రాల క‌న్నా చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఇది నేను మాములుగా అన్ని సినిమాలకు చెప్పను. ఇది మీరు ఖచ్చితంగా రాసిపెట్టుకోండి` అంటూ రామ్ చ‌ర‌ణ్ చెప్ప‌డంతో అభిమానులు ఉత్సాహంతో ఊగిపోయారు. రామ్ చ‌ర‌ణ్ కామెంట్స్ బ‌ట్టి చూస్తే పెద్దిపై ఆయ‌న ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రి `గేమ్ ఛేంజ‌ర్‌`తో ఇటీవ‌ల బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ అందుకున్న చ‌ర‌ణ్‌.. పెద్దితో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కుతారా? లేదా? అన్న‌ది చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: