టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సోలో హీరోగా మూవీ కమిట్ అయ్యి చాలా కాలమే అవుతుంది. ఆఖరుగా నాగార్జున సోలో హీరోగా నా సామి రంగ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత నాగార్జున , శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందిన కుబేర అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటించాడు. కొన్ని రోజుల క్రితం విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా నాగార్జున కు మంచి గుర్తింపు లభించింది.

ప్రస్తుతం నాగార్జున , సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. నా సామి రంగ సినిమా తర్వాత రెండు సినిమాలకు కమిట్ అయిన నాగార్జున సోలో హీరోగా మాత్రం ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దానితో ఆయన అభిమానులు ఈ మధ్య కాలంలో కచ్చితంగా సోలో హీరోగా ఓ మూవీ కి కమిట్ అయితే బాగుంటుంది అని అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇకపోతే తాజాగా నాగర్జున ఓ మూవీ కి కమిట్ అయినట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం తమిళ్లో ఆయోతి అనే సినిమా వచ్చింది.

మూవీ రీమేక్ లో నాగార్జున నటించాలి అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయోతి సినిమా 2023 వ సంవత్సరం విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది. ఈ మూవీ తెలుగు రీమిక్ లో నాగ్ నటించే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: