టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా కష్టపడుతున్న హీరోలలో అక్కినేని అఖిల్ కూడా ఒకరు అని చెప్పుకోవడంలో సందేహం లేదు. తాత పెద్ద హీరో నాన్న అంతకుమించిన హీరో.. ఇండస్ట్రీలో బాగా బ్యాక్ గ్రౌండ్ ఉంది . కానీ అఖిల్ అక్కినేని మాత్రం  ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు . ఆయన సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  కాగా తాజాగానే పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడైన అఖిల్ అక్కినేని.. లెనిన్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం పక్క అనేలా క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
 

"ఏజెంట్" లాంటి సినిమా తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని అఖిల్ చేస్తున్న మూవీ లెనిన్.  దర్శకుడు కిషోర్ అపూర్వ తెరకెక్కిస్తున్న ఈ మాస్ చిత్రం పట్ల మంచి అంచనాలు నెలకొన్నాయి . కాగా ఈ సినిమాలో ముందుగా హీరోయిన్గా శ్రీలీల అనుకున్నారు.  కానీ కొన్ని కారణాలు చేత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది . అయితే శ్రీలీల ప్లేస్ ను రీప్లేస్ చేసే విధంగా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో జాయిన్ కాబోతుందట.  జూలై 16 నుంచి షూటింగ్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది.



సో శ్రీ లీల అయితే ఈ సినిమాలో లేదనే విషయం ఈజీగా అర్థమయిపోతుంది . ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా సితార ఎంటర్టైన్మెంట్ ఫోర్ సినిమాస్ అలాగే శ్రీ కారా స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు . భాగ్యశ్రీ బోర్సే  అఖిల్ జంట చూడముచ్చటగా ఉంటుంది అని నో డౌట్ అఖిల్ ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అంటూ అక్కినేని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ ఆయన లుక్స్ చూస్తే కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ మాట్లాడుకుంటున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: