
నిజమైన వైసీపీ అభిమాని ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాని చూడనే చూడకూడదు అంటూ చెప్పుకు వస్తున్నారు. దీనికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రఘురామ కృష్ణం రాజు మాట్లాడిన మాటలే అంటూ జనాలు చెప్తున్నారు. మనకు తెలిసిందే రీసెంట్ గానే "హరిహర వీరమల్లు" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది . ఈవెంట్ కి వన్ ఆఫ్ ద స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు రఘురామకృష్ణంరాజు .
అయితే ఆయన స్టేజి పైకి వచ్చి మాట్లాడుతూ ప్రత్యక్షకంగా పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ పరోక్షకంగా వైసిపి నేతలను ఏకీపారేశారు. మరీ ముఖ్యంగా ఆయన స్పీచ్ లో "ఔరంగాజేబును ఓడించే ముందు నిజ జీవిత ఔరంగాజేబును ఓడించం" అన్న వ్యాఖ్యలు బహిరంగంగానే వైసిపిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసిపి నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు బాయ్ కాట్ హరిహర వీరమల్లు అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు . ఈ పరిణామాల వల్ల హరి హర వీరమల్లు సినిమా విడుదలకు ముందే రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది . అంతేకాదు ఈ సినిమా హిట్ అవుతుందా..? లేక రాజకీయ ప్రభావంతో కలెక్షన్ ల పై ఎఫెక్ట్ పడుతుందా..? అంటూ ఇప్పుడు పెద్ద డిబెట్టే నడుస్తుంది . చూడాలి మరి పవన్ మ్యానరిజం ఈ నెగిటివిటీని మొత్తం ఎలా పాజిటివిటీగా మార్చేయబోతుందో..????