
బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని సినీనటి రమ్యకృష్ణ వి.ఐ.పి ప్రారంభ విరామ దర్శన సమయంలో దర్శించుకున్నారు . టిటిడి అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో చాలామంది రమ్యకృష్ణతో ఆటోగ్రాఫ్ , ఫోటోగ్రాఫ్ అంటూ గుమ్మిగూడారు . మీడియా వాళ్ళు కూడా ఆమెను ఫొటోస్ తీయడం ప్రారంభించారు .
చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఇలా వీడియోలో తీస్తున్నప్పుడు "ఇది గుడి ప్రైవసీ ఇవ్వండి ..ప్రశాంతంగా ఉండండి " అంటూ మీడియా రిపోర్టర్స్ పై కోపడుతూ ఉంటారు . ఫోటోలు.. సెల్ఫీస్ అడిగిన ఇవ్వరు . కానీ రమ్యకృష్ణ మాత్రం చాలా ఓపిక గా అడిగిన వారికి ఫొటోస్ ఇస్తూ మీడియా వాళ్లతో చాలా గౌరవంగా బిహేవ్ చేశారు . దీనితో సోషల్ మీడియాలో రమ్యకృష్ణ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. మొదటి నుంచి రమ్యకృష్ణ అందరి దగ్గర చాలా మంచి మనిషి అంటూ పేరు సంపాదించుకుంటుంది. కోపం అనేది రాదు అని పబ్లిక్ లో అస్సలు ఆమె కోపాన్ని చూపించదు అని అంత అంటూ ఉంటారు . ఇంత ఏజ్ వచ్చినా ఇంకా కూడా ఆమె అలానే ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది . చాలామంది ఫ్యాన్స్ ఇంకా నీకు ఆ బుద్ధి మారలేదా రమ్యకృష్ణ..? అందుకే నువ్వు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్నావు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు..!