తేజ సజ్జ తాజాగా మీరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు ఇప్పటికే సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే పదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన మీడియం రేంజ్ హీరోల సినిమాలలో అదిరిపోయే రేంజ్ ప్లేస్ లో నిలిచింది. మరి మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన పదవ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 తెలుగు మూవీలు ఏవి ..? అందులో మీరాయ్ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లతో ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

తేజ సజ్జ హీరో గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా విడుదల అయిన పదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.91 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మీడియం రేంజ్ హీరోలలో పదవ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో మొదటి స్థానంలో నిలిచింది. బేబీ సినిమా 3.40 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది. తేజ సజ్జ హీరో గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మీరాయ్ మూవీ విడుదల అయిన పదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.69 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది. నాగ చైతన్య హీరో గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన తండెల్ సినిమా విడుదల అయిన పదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.66 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మీడియం రేంజ్ హీరోలలో విడుదల అయిన పదవ రోజు హైయెస్ట్ కలెక్షన్లను చేసిన సినిమాలలో నాలుగవ స్థానంలో నిలిచింది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం సినిమా 2.63 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 5 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: