గత కొంత కాలంగా విడుదల అయ్యే సినిమాలపై కాస్త క్రేజ్ ఉన్నట్లయితే చాలా మంది మేకర్స్ తమ  ఆ సినిమాను అత్యంత భారీ టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే టికెట్ రేట్లు భారీగా పెరగడంతో అనేక మంది సినిమా థియేటర్కు వెళ్లి సినిమా చూడాలి అని ఆలోచనను కూడా విరమించుకుంటున్నారు. ఇక కొంత మంది కుటుంబం మొత్తంతో కలిసి సినిమాకు వెళ్లినట్లయితే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతో భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతున్నాయి అనే ఉద్దేశంతో కూడా థియేటర్కు వెళ్లి సినిమా చూడకుండా ఓ టీ టీ లో సినిమాను చూడడానికి ప్రముఖ ప్రాధాన్యతను ఇస్తున్నారు.

దానితో కూడా సినిమా థియేటర్కు వచ్చే జనాల సంఖ్య కూడా భారీగా తగ్గిపోతుంది అని కూడా కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే తాజాగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించిన ఓ సినిమాను అత్యంత తక్కువ టికెట్ ధరకే చూసే వెసులు బాటను మూవీ బృందం వారు కల్పించారు. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా తేజ సజ్జ మీరాయ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

మంచు మనోజ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే భారీ కలెక్షన్లను వసూలు చేసి బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కూడా కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను అత్యంత తక్కువ టికెట్ ధరకే చూసే  వెసులు బాటను కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ లలో బాల్కనీ టికెట్ ధరను 150 రూపాయలు గాను ,  ఫస్ట్ క్లాస్‌ ను , ఫస్ట్ క్లాస్ ను 105 రూపాయలు గాను నిర్ణయించారు. మరి ఈ నిర్ణయంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరుగుతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: