టాలీవుడ్ కోలీవుడ్లో తన అందం అభినయంతో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఇటీవల కాలంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ ఈమె నటించిన చిత్రాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈమె నటించిన నాలుగు చిత్రాలలో ముగ్గురు ప్లాపులు హీరోలకు ఒక మంచి హిట్ ఇచ్చింది అనుపమ. దీంతో ఈ ముగ్గురు హీరోలకు లక్కీ హీరోయిన్గా మారిపోయింది. ముఖ్యంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ కాంబినేషన్లో వచ్చిన రాక్షసుడు సినిమా తర్వాత మళ్లీ అంతటి సక్సెస్ అందుకోలేదు. ఈ ఏడాది వచ్చిన కిష్కిందపురి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు.


బైసన్ సినిమాతో మొట్టమొదటి భారీ విజయాన్ని అందుకున్నారు హీరో ధ్రువ్ విక్రమ్. డైరెక్టర్ మారి సెల్వరాజ్ డైరెక్షన్లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం తమిళంలో భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటివరకు రూ .55 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ధ్రువ్ కెరియర్లో ఫస్ట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అనుపమ, ధ్రువ్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని రూమర్స్ వినిపించాయి. కిష్కిందపురి, బైసన్ సినిమా మధ్యలో విడుదలైన మలయాళ చిత్రం పేట్ డిటెక్టివ్.


ఈ చిత్రం కేరళలో భారీగానే కలెక్షన్స్ రాబట్టింది .అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా రూ .20 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో షరీఫ్ యూ ధీన్ హీరోగా అటు నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్నారు. అంతకుముందు నటించిన షరీఫ్ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో అనుపమ ఇప్పుడు ముగ్గురు హీరోల పాలిట లేడీ లక్కీ హీరోయిన్గా మారిందనే విధంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ హీరోలకు మాత్రం సక్సెస్ అందించి అభిమానులకు కాస్త పోరాట కలిగించింది. అనుపమ కూడా సక్సెస్ హీరోయిన్గా పేరు సంపాదించింది.రాబోయే రోజులు మరిన్ని విభిన్నమైన కథలతో ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తోంది అనుపమ.

మరింత సమాచారం తెలుసుకోండి: