ఏపీలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోన్నాయి.సార్వత్రిక ఎన్నికల తరువాత రాష్ట్రంలో వైసీపీ బలమైన శక్తీగా ఎదగడం ప్రతిపక్ష టీడీపీ నిస్తేజంలోకి వెళ్లడంతో టీడీపీ భవిష్యత్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.ఒకవైపు పాలనాపరంగా తన దారిలో సొంత ఆలోచనలతో అడుగులు వేస్తున్న సీఎం ఎవరు ఎన్ని విమర్శలు చేసిన  వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు.


ఇదంతా ఇలా ఉంటే ఏపీలో తామే ప్రత్యామ్నాయం అని తెర వెనుక ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఇప్పుడు తమ అదృష్టాన్ని పరిక్షిచుకోవడం వ్యూహాలను సిద్ధం చేస్తోంది.సార్వత్రిక ఎన్నికల్లో  డిపాజిట్ కూడా రాకపోవడంతో ఇప్పుడు సొంతంగా జనసేనతో కలిసి కూటమిని  సిద్ధం చేసి రాష్ట్రంలో రాజకీయా ప్రయాణం ప్రారంభించింది.అయితే కేంద్రంలో బుక్ఫ్ అధికారంలో ఉన్న ఏపీలో ఉన్న రెండు ఎమ్మెల్సీలతో  ఏదో అలా తమ పొలిటికల్ జర్నీని నెట్టుకొస్తున్నారు.అయితే ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర బీజేపీ ఎపిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం.2014,2019 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ తమ హావా కొనసాగిస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ఉనికి నిలుపుకోవడం కోసం తెగ తాపత్రయ పడుతున్నారు కమలం పార్టీ నేతలు.అయితే ఈశాన్య, ఉత్తర భారతదేశంలో తమ స్థానాన్ని పదిలం చేసుకున్న బీజేపీ ఇప్పుడు దక్షిణాదిన  అందులోనూ తెలుగు రాష్ట్రాలపైన గురి పెట్టిందా  అనే అనుమానం కలుగుతుంది.


తెలుగు రాష్ట్రాల్లో బలపడడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్న కమలనాథులు ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం ఇప్పటికే పరిపాలన పరమైన అంశాల్లో తెలంగాణ,ఏపీపై గురి పెట్టిన కమలం పార్టీ  రాష్ట్ర గవర్నర్లకు పిర్యాదు చేయడం,ఆర్ధిక అవకతవకలు లాంటి అంశాల్లో దూకుడుగా పని చేస్తున్నారు.ఇప్పటికే తెర వెనుక జరుగుతున్న అన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచడంతో పాటు గవర్నర్ల ద్వారా మొత్తం సమాచారం తీసుకునే పనిలో నిమగ్నమయ్యారట.
ఇప్పటికే తెలంగాణ గవర్నర్ గా తమిళ సై బాధ్యతలు చేపట్టాక తెలంగాణ ప్రభుత్వం కొంత జాగ్రత్తగా అడుగులెహ్ వేయడంతో పాటు ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరిస్తోందట గతంలో ఆడిందే ఆటగా పడిందే పాటగా తెలంగాణ సర్కారు కు గవర్నర్ జోక్యం పాలన వైఫల్యాల విషయంలో ఆర్ధిక అవతవకల విషయంలో పెరగడంతో సైలెంట్ అయ్యిందట తెలంగాణ సర్కారు.


ఇక ఏపీలోను అనేక వైఫల్యాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారట.ఇప్పటికే అనేక అవతవకల విషయంలో గవర్నర్ కు ఫిర్యాదులు రావడం ప్రతి విషయంలో బిస్వ భూషన్ జోక్యం పెరగడంతో ఇప్పుడు ఏపీపై కూడా పట్టు నిలుపుకోవడమే ఎజెండా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.ఇప్పటికే అనేక మార్లు గవర్నర్ తో భేటీ అయిన సీఎం  తమ తప్పుల విషయంలో గవర్నర్ తో భేటీ తరువాత మార్పులు చేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు  కొందరు కమలం పార్టీ నేతలు.



మరింత సమాచారం తెలుసుకోండి: