సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం.. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ భయాందోళనల కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలను హెచ్చరించింది. ఈ రోజు అత్యవసర భేటీ అయిన డబ్ల్యూహెచ్ఓ.. ఆగ్నేసియా దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజారోగ్యం, సామాజిక చర్యలను పటిష్టం చేేసుకోవాలని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ పెంచాలని విజ్ఞప్తి చేసింది.

కరోనా కొత్త వేరియంట్ B.1.1.529 మళ్లీ హడలెత్తిస్తోంది. యువతపై ఎక్కువ ప్రబావమని శాస్త్రవేత్తలు చెప్పడం వణకిస్తోంది. దీని స్పైక్ ప్రోటీన్ లోనే 30కి పైగా మ్యుటేషన్లు గుర్తించారు. డెల్టా, డెల్టా ప్లస్ లలో 2-3ఉండేవి. వ్యాక్సిన్లు ఈ వేరియంట్ పై ఎలా పనిచేస్తాయనే క్లారిటీ లేదు. డబ్ల్యూహెచ్ ఓ దీనికి ఓమిక్రాన్ పేరు పెట్టి.. వేరియంట్ ఆఫ్ కన్నర్స్ గా ప్రకటించింది. దీంతో దేశాలు మళ్లీ ఆంక్షల బాట పడుతున్నాయి.

మరోవైపు ఆఫ్రికా దేశాల్లో కొత్త వేరియంట్ కలకలం కారణంగా.. పలు దేశాలు మళ్లీ ట్రావెల్ బ్యాన్ ల బాట పడుతున్నాయి. తాజాగా ఏడు ఆఫ్రికా దేశాలకు సౌదీ అరేబియా రాకపోకలు నిషేధించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బోట్స్ వానా, మొజాంబిక్, లెసొతో, ఎస్వతీని దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన పర్యాటకులను సౌదీకి అనుమతి లేదని అధికారులు ప్రకటించారు.

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పట్ల అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. న్యూయార్క్ లో హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్ ప్రకటించారు. గతేడాది కరోనా వల్ల న్యూయార్క్ తీవ్రంగా ప్రభావితమైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్టు గవర్నర్ తెలిపారు. అయితే న్యూయార్క్ లో రోజుకు ఆరు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వేరియంట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.











మరింత సమాచారం తెలుసుకోండి: