ఏపీ సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుక‌ల‌కు రాష్ట్రం మొత్తం కొత్త శోభ‌ను అలంక‌రించుకుంది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జ‌గ‌న్ ఇంట్లో ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. నాయ‌కులు తమ ఇంట్లో చేసుకునే సంబ‌రాలుగానే భావిస్తుంటారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ఇంట్లో జ‌రుగుతున్న పుట్టిన రోజు వేడుక‌ను కూడా.. రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా చేసుకునేందుకు వైసీపీ నాయ‌కులు రెడీ అయ్యారు. ప్ర‌స్తుతం 49వ ఏట ఉన్న జ‌గ‌న్‌.. రేపు అంటే.. మంగ‌ళ‌వారం డిసెంబ‌రు 21న 50వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెడ‌తారు.

నిజానికి ఇది వైసీపీ నేత‌ల్లో ఎన‌లేని ఆనందాన్ని నింపుతోంది. త‌మ నాయుడు.. జ‌న నేత‌.. పేద‌ల పెన్నిధి పుట్టిన రోజును ఘ‌నంగా చేసుకునేందుకు సంబ‌రంతో ముందుకు సాగుతున్నారు. అయితే.. దీనిపై తాడేప ల్లి నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. అంటే ఘ‌నంగా చేయాల‌ని కానీ.. లేదా వ‌ద్ద‌ని కానీ ఎక్క‌డా ఎవ‌రికీ ఎలాంటి ఆదేశాలూ రాలేదు. అయిన‌ప్ప‌టికీ.. నాయకులు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ముఖ్యం గా వీరిలో.. మంత్రి వ‌ర్గం రేసులో ఉన్నార‌ని వినికిడిలో ఉన్న నేత‌లు.. ఎక్కువ‌గా రియాక్ట్ అవుతున్నారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో పుట్టిన రోజును ఘ‌నంగా చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, ప్ర‌త్యేక స‌భ‌లు, స‌మావేశాలతో పాటు 50 కిలోల చొప్పున కేక్‌లు క‌ట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే.. వీరిల‌లోనూ కొంద‌రు ఎమ్మెల్యేలు.. మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి , మంత్రి నారాయ‌ణ స్వామి వంటివారు.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో  పేద‌లు కార్య‌క్ర‌మాలు చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఇటీవ‌ల వ‌ర‌ద‌లు వ‌చ్చిన ప్రాంతాల్లో ప‌ర్య‌టించి.. అక్క‌డి ప్ర‌జ‌ల మ‌ధ్యే జ‌గ‌న్ పుట్టిన రోజు నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. ఇక‌, మ‌రిక‌కొన్ని చోట్ల అనాథాశ్ర‌మాల్లోనూ .. జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుక‌లు నిర్వ‌హించేందుకు నాయ‌కులు నిర్ణ‌యించారు. మొత్తానికి జ‌గ‌న్ ఇంట వేడుక‌.. వైసీపీ నేత‌ల‌కు పండ‌గ‌.. అనే కామెంట్లు  వినిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: