వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని విపక్ష నేత చంద్రబాబు తీవ్రమైన ఆరోపణలు చేశారు. పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు నిర్వహించిన టీడీపీ  వ్యూహ కమిటీ సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ భేటీలో ఏమన్నారంటే.." వివేకా హత్యలో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారు.. ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోంది.. వివేకా హత్యను నాపై నెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందారు.. బాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పూర్తిగా పతనం అయ్యారు.. హత్య కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తే ఏమవుతుంది....నాపై 12వ  కేసు అవుతుంది.. అని జగన్ వ్యాఖ్యానించడం అతనికి చట్టం అంటే లెక్కలేనితనాన్ని స్పష్టం చేస్తోందని చంద్రబాబు అన్నారు.


వివేకా హత్యను గతంలో రాజకీయంగా వాడుకున్న జగన్ ఇప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాబాయ్ హత్యలో సూత్రధారి ఎవరో అనేది ఇప్పుడు తేలిపోయిందని....ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలన్న చంద్రబాబు.. నాడు గ్యాగ్ అర్డర్ తేవడం నుంచి....ఇప్పుడు సిబిఐ విచారణను తప్పు పట్టడం వరకు హత్య కేసులో జగన్ ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయని విమర్శించారు. ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు డైవర్ట్ పాలిటిక్స్ అమలు చేస్తున్న జగన్....ఈ విషయంలో ప్రజలను ఏమార్చలేరని చంద్రబాబు అన్నారు.


వివేకా హత్యను పాత్రధారులకే పరిమితం చేసి.. సూత్రధారుల్ని బోనులో నిలబెట్టకపోతే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ పౌరుని ప్రాణాలకైనా రక్షణ ఉంటుందా అని చంద్రబాబు ప్రశ్నించారు.  వైఎస్ కోటలోనే వైఎస్ తమ్ముణ్ణి హత్య చేయడం అంత:పుర పెద్ద ప్రోత్సాహం లేకుండా సాధ్యమా అని చంద్రబాబు ప్రశ్నించారు.


మరోవైపు వివేకా హత్య కేసు విచారణ తాజాగా అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐకి కీలక వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఈ హత్యలకు సూత్రధారి అని చెబుతున్నట్టు ఉన్నాయి. తాజాగా వివేకా అల్లుడుఏకంగా జగన్‌ నే అనుమానిస్తూ వాంగ్మూలం ఇచ్చారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: