ఇప్పుడు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే..తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే..తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది.


ఉపరితల ఆవర్తనం ఏపీలోని కోస్తా తీరంతో పాటు ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మధ్య భాగాలలో సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి..వర్షాల ప్రభావంతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

 

అక్టోబర్ 6 నుంచి 9 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. గురువారం సైతం పలు జిల్లాల్లో చిరు జల్లులు, మోస్తరు వర్షాలు కురిశాయి..ఏపీపై అల్పపీడనం ప్రభాంతో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు పడతాయి. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో పిడుగులు పడతాయని హెచ్చరించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది..రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా ఓ మోస్తారుగా వర్షాలు కురవనున్నాయని అధికారులు తెలిపారు.అలాగే ఉరుములు మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: