కరోనా బారిన పడిన ఇప్పటికే 11 వేలమంది పడ్డారు.  వీరిని ఆదుకోవడానికి కార్పొరేట్ దిగ్గజాలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.  భారీ విరాళాలు ప్రకటిస్తున్నాయి.  వీలైనంత త్వరగా మెడిసిన్ ను కనుగొనాలని చూస్తున్నారు.  ఎప్పటికి ఇది పూర్తవుతుందో తెలియదు. చైనాలో ఇప్పటికే 300 మందికి పైగా మరణించినట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది.  ఈ వైరస్ ఇప్పటికే 17 దేశాలకు వ్యాపించింది.  


ఇండియాలో కూడా దీనిప్రభావం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.  మొదటికేసు కేరళలో నమోదైంది. కేరళలో ఈ కేసు నమోదు కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. అత్యవరసర వార్డులను ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమానాలున్నా వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన హాస్పిటల్ కు వచ్చి చెక్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.  అనుమానితుల కోసం 24 గంటలపాటు అందుబాటులో ఉండే విధంగా కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.  


కాగా, మొన్నటి రోజున వుహాన్ నగరం నుంచి ఇండియాకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో అక్కడ ఉన్న ఇండియన్ విద్యార్థులు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.  వీరిని హర్యానాలోని మానేసర్ లో ఉంచి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.  మొత్తం 324 మంది పౌరులు ఇండియాకు రాగా అందులో 95 మందిపై కరోనా వైరస్ ఎటాక్ అయిందేమో అనే అనుమానాలు ఉన్నాయి.  


ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ ఏర్పాటు చేసిన అత్యవసర హాస్పిటల్ లో వీరిని ఉంచి వైద్య పరీక్షలు చేస్తున్నారు.  మొత్తం 14 రోజులపాటు వీరిని పరీక్షించబోతున్నారు.  14 రోజుల్లో వీరికి ఎలాంటి ఎఫెక్ట్ లేదని తేలితే ఇంటికి పంపిస్తారు.  వైరస్ సోకినట్టుగా తేలితే, వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తారు.  అయితే, ఈ వైరస్ ను అడ్డుకోవడానికి ఇప్పటి వరకు ఎలాంటి మందు కనుగొనలేదు.  ఎలా దీనికి చికిత్స అందిస్తారో తెలియాల్సి ఉన్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి: