గత కొన్ని రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగాయి.  గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఒక్క సారిగా వాడివేడిగా మారిపోయాయి. ఇక గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. ముఖ్యంగా బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ జరిగగా.. చివరికి స్వల్ప తేడాతో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇకపోతే ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేడి తగ్గింది అనుకుంటున్న తరుణంలో మరికొన్ని రోజుల్లో వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగేందుకు అంతా సిద్ధం అవుతుంది.



 ఉగాది తర్వాత వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో టాక్ వినిపిస్తుంది. అన్ని పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరంగల్ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంతో ఉన్న కేసీఆర్ వరంగల్ ఎన్నికల  పూర్తి బాధ్యతను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి అప్పగించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.



 అంతే కాకుండా ఇక వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేటీఆర్ పర్యవేక్షిస్తారు అని అర్థమవుతుంది. దాదాపు ఐదు నియోజకవర్గాల్లో వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఐదు నియోజకవర్గాల్లో కూడా సత్తా చాటేందుకు ప్రచార బాధ్యతలు చేపట్టడం ఎర్రబెల్లికి సాధ్యమవుతుందని ప్రస్తుతం టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ సిద్ధమైనట్లు సమాచారం. ఈ నెల 14న ఓటర్ల లెక్కింపు చేసి.. ఇక రిజర్వేషన్ కూడా ఖరారు చేసి ఇక వచ్చే నెలకల్లా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: