ఎన్నో ఏళ్ల త‌రువాత అయోధ్య రామ మందిరానికి బీజం ప‌డింది. ఎంద‌రో ప్రాణ త్యాగాలు, ఎన్నో పోరాటాలు, పార్టీల నుంచి ప్ర‌జ‌ల నుంచి అయోధ్య‌పై ఎప్పుడు ఫోక‌స్ ఉండేది. దేశ వ్యాప్త ఎన్నిక‌ల్లోనూ అయోధ్య రామ‌మందిర వివాదం ప్ర‌ముఖంగా ఉండేది. అయోధ్య‌లో బాబ్రీ మ‌సీద్ ను కూల్చ‌డం రామ‌మందిరాన్ని నిర్మించ‌డం ల‌క్ష్యంగా ప‌లు హిందూ సంస్థ‌లు ప‌ని చేశాయి. ఎట్ట‌కేల‌కు కొన్ని నెల‌ల క్రితం సుప్రీం కోర్టు మందిర నిర్మాణానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ వివాదంపై అటు ముస్లీములు, ఇటు హిందువుల మ‌ధ్య అనేక సంవ‌త్స‌రాలుగా గొడ‌వ జ‌రుగుతూనే ఉంది.
   
  ఎట్ట‌కేల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అయోధ్య రామాలయ నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆల‌య నిర్మాణానికి అయోధ్య రామాల‌య ట్ర‌స్ట్ పెద్ద ఎత్తున విరాళాలు సేక‌రించింది. దాదాపు 12 వంద‌ల కొట్ల రూపాయ‌ల‌ను దేశ వ్యాప్తంగా సేక‌రించింది. అయితే ఈ డ‌బ్బుల‌ను కేంద్రం, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం వాడుకుంటుంద‌ని ప‌లు ఆరోప‌ణ‌లు కూడా గ‌తంలో వ‌చ్చాయి.
   
  ఇటీవ‌ల బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా బీజేపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాముడిని ఎన్నిక‌ల అస్త్రంగా బీజేపీ వాడుకుంద‌ని ఆరోపించారు. అయోధ్యలోని రామాలయం నిర్మాణం కోసం సేకరించిన విరాళాలను ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటుందని మిశ్రా సంచలన ఆరోపణలు చేశారు. ఆల‌య నిర్మాణానికి ఇప్పటివరకు పునాది ప‌డ‌లేద‌ని చెప్పారు. ఏ సమయంలో ఆలయ నిర్మాణం పూర్తి అవుతుందో అధికార పార్టీ చెప్పలేక పోతుందని మిశ్రా అన్నారు. ‘‘రామాలయం కోసం సేకరించిన విరాళాలను ఉపయోగించి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు చేస్తోందని ఆరోపించారు. ఆలయ విరాళాలను ఉపయోగించి 500 ఎన్నిక ప్ర‌చారానికి రథాలను బీజేపీ సిద్ధం చేసింది అని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడు మిశ్రా పేర్కొన్నారు.

  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 23 శాతం ఉన్న దళితులు, 13 శాతం ఉన్న బ్రాహ్మణులు కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పిలుపునిచ్చారు.  బీఎస్పీ హయాంలో బ్రాహ్మణులకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించామని, 2007వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 మంది బ్రాహ్మణులకు బీఎస్పీ త‌ర‌ఫున టికెట్లు ఇచ్చామని చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు అయోధ్య నుంచి ఎన్నికల ప్రచారాన్ని బీఎస్పీ ప్రారంభించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp