ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని అటు ఉద్రిక్తంగా మార్చేశారు తాలిబన్లు. ఆయుధాలతో అరాచకాలు సృష్టించి   ఆధిపత్యాన్ని చేపట్టి ఇటీవలే తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు  ఈ క్రమంలోనే తమ చట్టాలలో ఎన్నో రకాల మార్పులు తీసుకు వస్తామని ఇక అక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టము అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతే కాదు మహిళలకు కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.  అయితే అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తాలిబన్లు ఇచ్చిన స్టేట్మెంట్ లు అంతర్జాతీయ సమాజం లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇక ఇటీవలే తాలిబన్లు ముసుగు తొలగిస్తూ అసలు రూపం బయట పెడుతున్నారు.



 మహిళలను మళ్లీ బానిసలుగా మార్చుకుంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు.  అదే సమయంలో ఇటీవలే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో ఆధిపత్యాన్ని చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ప్రపంచ దేశాలతో సంబంధాలు సందిగ్ధంలో పడిపోయారు.  ఇప్పటికే అన్ని దేశాలు తాము తాలిబన్ల ప్రభుత్వాన్ని ఆమోదించము అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం చైనా పాకిస్తాన్ తప్ప ఇప్పటి వరకు ఏ దేశం కూడా తాలిబన్లు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది లేదు. దీంతో అక్కడ ఆర్థిక సంక్షోభంతో పాటు ఆహార సంక్షోభం కూడా రోజురోజుకు పెరిగిపోతోంది.  ఆఫ్ఘనిస్థాన్లో ప్రజలందరూ అల్లాడిపోతున్నారు.



 ఆఫ్ఘనిస్తాన్ లో ఏర్పడిన సంక్షోభాన్ని అటు మిత్ర దేశంగా మెలుగుతున్న పాకిస్తాన్ క్యాష్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.  ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభాన్ని చూపిస్తూ ప్రపంచ దేశాల దగ్గర సహాయం కోరుతుంది పాకిస్తాన్. ఇలా ప్రపంచ దేశాలు సహాయం చేస్తే ఇక తమ దేశ అవసరాలకు వాడుకుంటుంది అన్నది ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం లో వినిపిస్తున్న మాట. ఇలా ఆఫ్ఘనిస్తాన్ ని చూపించి పాకిస్తాన్ అడుక్కోవడం మొదలుపెట్టిందని ఇంతకంటే ఇంకా నీచం ఏమీ ఉండదు అంటూ  విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: